బాల్య దశలోనే బ్రా సైజ్ అడిగేవారు.. సయంతని ఘోష్

by Javid Pasha |

దిశ, సినిమా: ప్రముఖ హిందీ టెలివిజన్ యాక్ట్రెస్ సయంతని ఘోష్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన షాకింగ్ సంఘటనలను.. Latest Telugu News..

బాల్య దశలోనే బ్రా సైజ్ అడిగేవారు.. సయంతని ఘోష్
X

దిశ, సినిమా: ప్రముఖ హిందీ టెలివిజన్ యాక్ట్రెస్ సయంతని ఘోష్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన షాకింగ్ సంఘటనలను గుర్తుచేసింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె.. సినీ పరిశ్రమ కల్చర్, తన కేరిర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాల్య దశలో ఉన్నప్పుడే బాడీ షేమింగ్‌కు గురయ్యానన్న నటి.. 'నా బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉన్నందుకే అందంగా ఉన్నానంటూ కామెంట్స్ చేశారు. చిన్న వయసులోనే సెక్సీగా కనిపిస్తానని, ఎంతో మందితో సెక్స్ చేస్తే తప్ప బాడీ ఈ సైజ్ పెరగదన్నారు. కొంతమంది కావాలనే నా బ్రా సైజ్ అడిగేవారు. ఓ నిర్మాత కూడా తనతో కొన్ని రాత్రులు ఏకాంతంగా గడపాలని వేధించాడు' అంటూ భావోద్వేగానికి లోనైంది. ఈ క్రమంలోనే చిన్న వయసులో ఉన్న తనకు వాళ్లంతా బాడీ, సెక్స్ గురించి మాట్లాడుతుంటే ఏమీ అర్థంకాకపోయేదని, ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాక మనసు గాయపడిందన్న సయంతని.. పెళ్లయ్యేంత వరకూ తను కన్యగానే ఉన్నానని చెప్పింది. ఇక చివరగా గొప్ప దేశంగా చెప్పుకునే చోట ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుగా అనిపిస్తోందన్న ఆమె.. మహిళలు ఎప్పుడూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని హితవు పలికింది.

Next Story