Sai Dharam Tej: FSFAలో పోటీ పడుతున్న ‘సత్య’.. మీ మద్దతు తెలిపి గెలిపించాలంటూ సాయి ధరమ్ తేజ్ పోస్ట్

by Chukka Sudharani |

మెగా హీరో సాయిదుర్గ తేజ్ (Saidurga Tej) నటించిన ‘సత్య’ (Satya) హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలిమ్ (Short Film)గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

Sai Dharam Tej: FSFAలో పోటీ పడుతున్న ‘సత్య’.. మీ మద్దతు తెలిపి గెలిపించాలంటూ సాయి ధరమ్ తేజ్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగా హీరో సాయిదుర్గ తేజ్ (Saidurga Tej) నటించిన ‘సత్య’ (Satya) హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలిమ్ (Short Film)గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం ‘ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ (FSFA) 2024’లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో ‘సత్య’ షార్ట్ ఫిలిమ్ పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఓ నోట్ షేర్ చేశాడు.

‘తమ మనసుకు దగ్గరైన షార్ట్ ఫిలిమ్ ‘సత్య’ ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ కోసం పోటీ పడుతోంది. దీని కోసం షార్ట్ ఫిలిమ్ చూసి ‘సత్య’కు ప్రేక్షకులు ఓటు వేయాలి. దిల్ రాజు (Dill Raju) ప్రొడక్షన్స్‌తో కలిసి తమ విజయదుర్గ ప్రొడక్షన్స్ (Vijayadurga Productions) సంస్థలో చేసిన తొలి ప్రయత్నం సత్య. ఈ షార్ట్ ఫిలిమ్ నాకు ఎన్నో మెమొరీస్ (Memories) ఇచ్చింది. ఇందులో స్వాతి రెడ్డి (Swathi Reddy) హీరోయిన్‌గా నటించింది. నా ప్రియ మిత్రుడు, బెస్ట్ ఫ్రెండ్ విజయకృష్ణ ఈ ఫిలిమ్‌కు దర్శకత్వం వహించగా.. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా ‘సత్య’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఫిలింఫేర్ వెబ్ సైట్ ద్వారా ప్రేక్షకులు తమ ‘సత్య’ షార్ట్ ఫిలిమ్ చూసి తమ ఓటును వినియోగించుకొని గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు తేజ్.

Next Story