- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సత్తుపల్లి పోలీసుల హెచ్చరిక
రాత్రి వేళల్లో ఇంటి దొంగతనాలు జరుగుతున్నాయని, ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సత్తుపల్లి పట్టణ సీఐ టి.శ్రీహరి తెలిపారు.

దిశ,సత్తుపల్లి: రాత్రి వేళల్లో ఇంటి దొంగతనాలు జరుగుతున్నాయని, ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సత్తుపల్లి పట్టణ సీఐ టి.శ్రీహరి తెలిపారు. చాలామంది గ్రామాలలో రాత్రివేళ ఇంటి బయట వరండాలో నిద్ర పోయేటప్పుడు కూడా ఇంటికి తాళం వేయాలని రాత్రి పడుకునే ముందు ఇంటి ప్రధాన ద్వారం, వెనుక ద్వారం, అల్మారా లకు సరైన తాళాలు వేసుకున్నారో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. విలువైన వస్తువులు బంగారం, నగదు, విలువైన పత్రాలు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిది. ఇంట్లో ఉంచితే సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. లైటింగ్ రాత్రిపూట ఇంటి బయట, మెట్లు వద్ద, పెరట్లో లైట్లు వేసి ఉంచాలి. చీకటి ప్రదేశాలే దొంగలకు అనుకూలం అవకాశం కావున ఊరెళ్లే వారు ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నట్లయితే ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా బీట్ కానిస్టేబుల్‌కు సమాచారం ఇవ్వాలి.
ఇరుగుపొరుగు వారికి కూడా చెప్పాలని తెలిపారు. అనుమానిత వ్యక్తులు కాలనీలో కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా తిరిగేవారు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తెలిపారు. సీసీటీవీ కెమెరాను ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. సిసి కెమెరాల యాక్సెస్‌ను మాకు ఇస్తే పోలీస్ స్టేషన్ నుంచి కూడా చూడటం జరుగుతుంది. ఇది నేర నియంత్రణకు, నేరస్థులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేశాయి. బీట్ పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో ప్రతి గ్రామంలో & కాలనీలో నిఘా ఉంచామని తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. నేర నియంత్రణలో ప్రజల సహకారం పోలీసులకు ఎంతో అవసరమని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటుగా మీరు కూడా అప్రమత్తంగా ఉండడం వలన దొంగతనాలు అరికట్టవచ్చు. అత్యవసర సమయంలో డయల్ 100 ద్వారా పోలీసులను వెంటనే సంప్రదించాలని కోరారు.






