- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేట్ నికోబార్ దీవిని కాపాడదాం.. యువతకు రాహుల్ గాంధీ పిలుపు
పర్యావరణ ధ్వంసంపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన మోడీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

దిశ, వెబ్ డెస్క్: పర్యావరణ ధ్వంసంపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన మోడీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఒక వ్యాపారవేత్త లాభం కోసం మోడీ ప్రభుత్వం గ్రేట్ నికోబార్ దివిలోని 1.5 కోట్లకు పైగా చెట్లను, పగడపు దిబ్బలను ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. గ్రేట్ నికోబార్ అభివృద్ధి ప్రాజెక్టులో కేంద్రం వాణిజ్య ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. దానికోసం పర్యావరణాన్ని, అందులోని జీవుల ప్రాణాలను పణంగా పెడుతోందని ఆరోపించారు. ఇటీవల తాను భారతదేశ దక్షిణపు చివరికొన అయిన ఇందిరా పాయింట్ ను సందర్శించినట్టు తెలిపారు.
ఆ ద్వీపంలో నివసిస్తున్న గిరిజన తెగలు, వలస వచ్చిన ప్రజలతో మాట్లాడినట్టు తెలిపారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు కోసం అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని దానివల్ల గిరిజన ప్రజలు తమ భూములను కోల్పోతున్నారని చెప్పారు. గిరిజనులతో పాటు ప్రభుత్వం కేటాయించిన భూములు కోల్పోతున్న సైనికులకు సైతం సరైన పరిహారం అందడం లేదని చెప్పారు. అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతకు సైతం కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. ఈ దీవులు ప్రపంచం ఇంతవరకు చూడని అత్యంత అసాధారణమైన సుస్థిర గమ్యస్థానాలుగా మారుతాయని, అలాంటి భారతదేశం కోసమే పోరాడాలని చెప్పారు. ఈ పర్యావరణ విధ్వంసాన్ని ఆపగల శక్తి కేవలం యువతకే ఉందన్నారు






