- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటిలోనూ ఇక నో ప్రైవసీ.. Wi-Fi రూటర్లు మీ కదలికలను గుర్తిస్తాయ్..!
రీసెర్చర్స్ బీమ్‌ఫార్మింగ్ ఫీడ్‌బ్యాక్ ఇన్ఫర్మేషన్ డేటా ఆధారంగా వైఫై రూటర్‌తో మానవ కదలికలను గుర్తించవచ్చు.

దిశ, ఫీచర్స్ : ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ఇండ్లల్లో, ఆఫీసుల్లో వాడే వై-ఫై రూటర్లతో ప్రైవసీ రిస్క్ పొంచి ఉందా? అవి మానవ కదలికలను ట్రాక్ చేస్తాయా? అవుననే అంటున్నారు పరిశోధకులు. జర్మనీలోని కార్ల్‌స్రూహ్ ఇన్‌స్టిట్యూ్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చేసిన కొత్త పరిశోధన ప్రకారం ఇవి ఇంట్లో ఉన్న వ్యక్తులను 99.5% ఖచ్చితత్వంతో గుర్తించగలవని తేలింది.
కారణం ఇదే..
అధ్యయనంలో భాగంగా.. రీసెర్చర్స్ బీమ్‌ఫార్మింగ్ ఫీడ్‌బ్యాక్ ఇన్ఫర్మేషన్ (BFI) అనే డేటాను ఉపయోగించి,197 మంది పార్టిసిపెంట్స్‌ను పరిశీలించారు. వారి నడకతీరు, భంగిమ, కదలికల ఆధారంగా సెకన్లలో గుర్తించగలిగారు. రూటర్(Wi-Fi routers) సిగ్నల్‌ను సరిగ్గా డైరెక్ట్ చేయడానికి ఉపయోగించే BFI డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడకపోవడంవల్ల ఇది సాధ్యమవుతుందని కనుగొన్నారు. ఫోన్ ఆఫ్ చేసినా, బ్యాక్‌ప్యాక్ మోసినా లేదా నడక మార్చినా కూడా 50% కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో వ్యక్తుల కదలికలను గుర్తించగలిగారు.
లోపం ఎక్కడుంది?
రీసెర్చర్స్ బీమ్‌ఫార్మింగ్ ఫీడ్‌బ్యాక్ ఇన్ఫర్మేషన్ డేటా ఇక్కడ రూటర్‌ను గోడల గుండా చూడగలిగే ‘పాసివ్ కెమెరా’లాగా మార్చేయడంతో మానవ కదలికలు గుర్తించవచ్చునని శాస్త్రవేత్తలు తేల్చారు. సో.. దీనిని బట్టి ఇండ్లు, కాఫీ షాపులు, ఆఫీసుల్లోని సాధారణ రూటర్లకు ప్రైవైసీ రిస్క్ పొంచి ఉన్నట్లేనని భావిస్తున్నారు. ప్రధాన లోపం బీమ్‌ఫార్మింగ్ ఫీడ్‌బ్యాక్ ఇన్ఫర్మేషన్ (BFI) డేటా ఎన్‌క్రిప్ట్ చేయబకపోవడమే.. దీంతో రూటర్, ఫోన్/ల్యాప్‌టాప్ మధ్య సిగ్నల్‌ను మెరుగు పరచడానికి పంపే డేటాను ఎవరైనా (నెట్‌వర్క్‌కు కనెక్ట్ కాకుండానే) ఈజీగా ఇంటర్‌సెప్ట్ చేయవచ్చు. ఈ బీఎఫ్ఐ డేటాలో మానవ శరీరాల కదలికల వల్ల కలిగే భౌతిక మార్పులు (distortions) ఉంటాయి.
పరిష్కారం ఏమిటి?
హ్యాకర్లు లేదా సాంకేతిక అవగాహన ఉన్నవారు ఎవరైనా మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి, బీఎఫ్ఐ ఆధారంగా రూటర్ కలిగి ఉన్న పరిసరాల్లోని వ్యక్తులను గుర్తించడం సాధ్యం అవుతుంది. ఇక్కడ రూటర్ సాధారణంగా పనిచేస్తున్నప్పుడే ఇంట్లో ఎవరు ఎక్కడ ఎటువైపు నడుస్తున్నారనేది వారికి తెలిసిపోతుంది. ఇది తీవ్రమైన ప్రైవసీ లోపమని పరిశోధకులు అంటున్నారు. ప్రభుత్వాలు & టెక్ కంపెనీలు BFI డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడం లేదా బీమ్‌ఫార్మింగ్ ప్రోటోకాల్‌ను మార్చడం ద్వారా తక్షణ చర్యలు తీసుకోవచ్చునని సూచిస్తున్నారు. ఇప్పటికే మిలియన్ల ఇండ్లల్లో ఉన్న రూటర్లు ఈ లోపంతో ఉన్నాయి కాబట్టి.. ఇది ప్రైవసీ సమస్యగా మారే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.






