- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలిమర్ కరెన్సీ నోట్లు.. కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను తీసుకువస్తుందన్న వార్తలపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను తీసుకువస్తుందన్న వార్తలపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. పాలిమర్ కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పేపర్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. పాలిమర్ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకువచ్చే సాధ్యాసాధ్యాలపై ఆలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ నోట్లను ముద్రించి, వాటిని వాడకంలోకి తీసుకువస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఉపయోగాలేంటి? అన్న విషయాలపై ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. కాగితపు నోట్ల ముద్రణకు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం, పెద్దఎత్తున నోట్లు పాడయ్యి.. వాటిని చలామణి నుంచి తొలగించాల్సి రావడం వంటి కారణాలే ఈ ప్రతిపాదనకు దారితీసినట్లు తెలుస్తోంది.
2014 ఫిబ్రవరిలోనే.. ప్రభుత్వం పార్లమెంటుకు దీనిపై సమాచారం ఇచ్చింది. భౌగోళిక, వాతావరణ వైవిధ్యాల ఆధారంగా ఎంపిక చేసిన 5 నగరాల్లో ప్రయోగాత్మకంగా రూ.100 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు అప్పట్లోనే ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ నగరాలను సెలెక్ట్ చేశారు. కానీ.. సాంకేతిక, ఆపరేషనల్ లోపాలు తలెత్తడంతో పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ ప్రతిపాదనలను ఆర్బీఐ పరిశీలిస్తుండటంతో త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువస్తారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.






