రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-05 08:18:25  IST  )

ద్విచక్ర వాహనం అదుపు తప్పి కోరెం అరుణ్ కుమార్(22) అనే యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని వాడగూడెం పాలాయిగూడెం సమీపంలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ, మంగపేట: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కోరెం అరుణ్ కుమార్(22) అనే యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని వాడగూడెం పాలాయిగూడెం సమీపంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరుణ్ కుమార్ మండలంలోని రాజుపేట ఇసుక క్వారీలో పని చేసి ఇంటికి వస్తున్న క్రమంలో వాడగూడెం పాలాయిగూడెం గ్రామాల మధ్య టర్నింగ్ లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చేనులో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story