రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లలో ఖాళీల భర్తీ పిటిషన్ కొట్టివేత

by Malleboina Mahesh |

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లలో ఖాళీల భర్తీపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. మొదట హైకోర్టుకు వెళ్లాలని సూచించడంతో పిటిషన్ ఉపసంహరణ.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లలో ఖాళీల భర్తీ పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్లలో (State Human Rights Commissions) ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ను దాఖలైంది. కాగా ఈ పిటిషన్‌ను విచారించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా, ఈ సమస్యపై మొదట సంబంధిత రాష్ట్ర హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు సుముఖత చూపకపోవడంతో, పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని కోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది.

Next Story