- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరివెన రిజర్వాయర్ ను పరిశీలించిన సీఎం
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం భూత్పూర్ మండలం కరివెన రిజర్వాయర్ ను పరిశీలించారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం భూత్పూర్ మండలం కరివెన రిజర్వాయర్ ను పరిశీలించారు. హెలికాప్టర్ లో వచ్చిన సీఎంచ రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాటికి శ్రీహరి , ప్రభుత్వ చీఫ్ విప్ ఎన్నం శ్రీనివాసరెడ్డి కి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా తదిత స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే జీఎంఆర్, సంబంధిత నీటి పరగాల శాఖ అధికారులు రిజర్వాయర్ పరిస్థితులను వివరించారు. పనులను చేపట్టి వెంటనే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాము అని ముఖ్యమంత్రి వెల్లడించారు. రిజర్వాయర్ ను పూర్తి చేసేందుకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్, మాజీ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేగుల్లా కొత్వాల్, డిసిసి అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు.






