కేబీఆర్ పార్క్ వద్ద వృక్షాలకు ‘అంతిమ సంస్కారాలు’.. ప్రభుత్వ తీరుపై వినూత్న నిరసన

by Ramesh Naini |

కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం నరికివేసిన చెట్లకు పర్యావరణ ప్రేమికులు శుక్రవారం వినూత్నంగా ‘అంతిమ సంస్కారాలు’ నిర్వహించి నిరసన తెలిపారు.

కేబీఆర్ పార్క్ వద్ద వృక్షాలకు ‘అంతిమ సంస్కారాలు’.. ప్రభుత్వ తీరుపై వినూత్న నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం నరికివేసిన చెట్లకు పర్యావరణ ప్రేమికులు శుక్రవారం వినూత్నంగా ‘అంతిమ సంస్కారాలు’ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి పూనమ్ కౌర్ పాల్గొని పర్యావరణవేత్తలకు తన మద్దతు ప్రకటించారు. అభివృద్ధి పేరిట పచ్చని వృక్షాలను నేలకూల్చడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రకృతి పరిరక్షణకై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కు ‘గ్రీన్ లంగ్స్’గా ఉన్న కేబీఆర్ పార్క్ పరిసరాల్లో(25-35 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్) చెట్ల నరికివేతను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టరాదని ఇటీవల సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. పర్యావరణవేత్త కాజల్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ కేసు తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది.

Next Story