‘నెలకు కాదు.. వారానికోసారి జీతం ఇవ్వాలి’: తెరపైకి సరికొత్త డిమాండ్!

by Gantepaka Srikanth |

ప్రస్తుతం ఉద్యోగం చేస్తే ప్రతి ఒక్కరికీ నెల నెలా ఒకటో తేదీన లేదా మొదటి వారంలో జీతం ఇవ్వడం ఆనవాయితీ.

‘నెలకు కాదు.. వారానికోసారి జీతం ఇవ్వాలి’: తెరపైకి సరికొత్త డిమాండ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఉద్యోగం చేస్తే ప్రతి ఒక్కరికీ నెల నెలా ఒకటో తేదీన లేదా మొదటి వారంలో జీతం ఇవ్వడం ఆనవాయితీ. కానీ, అలా కాకుండా నెలలో రెండుసార్లు (15 రోజులకు ఒకసారి అకౌంట్లో సగం సగం జీతం పడితే ఎలా ఉంటుంది? వినడానికి భలే బాగుంది కదూ! సరిగ్గా ఇదే ఆలోచనను తెరపైకి తెచ్చారు ప్రముఖ వ్యాపారవేత్త, షాద్రికామ్ (Shaadi.com) వ్యవస్థాపకుడు, ట్యాండ్ ఇండియా జడ్జి అనుపమ్ మిట్టల్. భారతదేశంలో సాంప్రదాయకంగా వేస్తున్న విధానాన్ని అమలు చేయాలని ఆయన చేసిన ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.

అనుపమ్ మిట్టల్ ఏమన్నారంటే..?

ఇటీవల అనుపమ్ మిట్టల్ ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. "మీకు జీతం ఎప్పుడు అందాలి? అని ప్రశ్నిస్తూ కంపెనీల ఆలోచనా విధానాన్ని తప్పుబట్టారు. చాలా కంపెనీలు ఫ్లెక్సిబుల్ పని వేళలు, ఉచిత భోజనం, సెలవులు వంటి ఆఫర్‌ను గొప్పగా చెప్పుకుంటాయని. కానీ ఉద్యోగికి అత్యంత కీలకమైన సమయానికి జీతం ఇవ్వడం' అనే విషయాన్ని విస్మరిస్తాయని పేర్కొన్నాడు. భారతదేశంలో చాలా కంపెనీలు నెల ముగిసిన తర్వాత తదుపరి వారం రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు జీతాలు వేస్తాయని, కొన్ని కంపెనీలు ఒకటో తేదీన వేయాలని చూసినా పొడిగిస్తూ బ్యాంక్ హాలీడేస్ వల్ల ఆలస్యమవుతుందని చెప్పారు. కానీ తమ 'షాదీ.కామ్'లో మాత్రం కొన్ని నెలల క్రితమే ఈ పద్ధతిని మార్చామని, ప్రస్తుత నెల జీతాన్ని ఆ నెల ఆఖరి రోజే ఉద్యోగుల అకౌంట్లలో వేస్తామని తెలిపారు. జీతం ఒక వారం ఆలస్యమైతే ఉద్యోగుల ఈఎంఐలు బౌన్స్ అవుతాయి. ఇంటి అద్దె కట్టడం ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి క్యాష్ ఫ్లో (నగదు లభ్యత అనేది ఉద్యోగి గౌరవానికి సంబంధించిన విషయం అని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడితో ఆగకుండా ఆయన మరో అడుగు ముందుకు వేసి కంపెనీలు నెలకి రెండుసార్లు (ప్రతీ నెల 3వ తేదీన 50% 30వ తేదీన మిగిలిన 50%) జీతాలు ఇచ్చే విధానాన్ని పరిశీలించాలని కోరారు. దీనివల్ల ఉద్యోగులపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని, అప్పులు చేయాల్సిన అవసరం రాదని మార్కెట్లోలో కాసుగోలు శక్తి పెరిగో దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా వంటి అనేక దేశాల్లో కంపెనీల పరిమాణం, రంగాన్ని బట్టి వారానికి ఒకసారి, రెండు వారాలకు ఒకసారి లేదా నెలకి రెండుసార్లు జీతాలు ఇచ్చే విభిన్న పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విధానం వినడానికి బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో భారతదేశంలో దీనిని అమలు చేయడం అంత సులువు కాదని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఒక వ్యక్తికి నెలలో ఒకేసారి ఇచ్చే జీతాన్ని రెండు ముక్కలు చేసి ఇచ్చినంత మాత్రాన వారిలో ఆర్థిక క్రమశిక్షణ రాదు. రూ. 60,000 జీతం వచ్చే వ్యక్తి మొదటి రోజు రూ.30,000 ఖర్చు చేసే అలవాటు ఉంటే.. అతనికి రూ.30,000 ఇస్తే.. మొదటి రోజే రూ.15,000 ఖర్చు చేసి మిగతా దాని కోసం మళ్లీ అప్పులు చేస్తాడు. ఇక్కడ సమస్య జీతం వచ్చే ఫ్రీక్వెన్సీ కాదు. ఆర్ధిక అక్షరాస్యత లేకపోవడం, జీతాలు పెరగకపోవడం అని అభిప్రాయపడుతున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Next Story