పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

by Jakkula.Mamatha |

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
X

దిశ, మామడ: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. చెట్లే ప్రతి జీవకోటికి ప్రాణాధారమని, పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల, అటవీ అధికారి సుశాంత్ , అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎఫ్‌డీఓ నాగిని భాను, డి.ఎస్.పి శ్రీనివాస్, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story