నరసరావుపేటలో హై ఓల్టేజ్.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇళ్ల వద్ద భారీగా పోలీసులు

by Vemula.Srinu Prasad |

నరసరావుపేటలో హై ఓల్టేజ్.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇళ్ల వద్ద భారీగా పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: నరసరావుపేట నియోజకవర్గం(Narasaraopet Constituency)లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం(YSRCP government rule)లో జరిగిన అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు(TDP MLA Chadalawada Aravindababu) సవాల్ విసిరారు. చర్చ కోసం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

వైఎస్సార్సీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వీకరణ

ఎమ్మెల్యే అరవిందబాబు విసిరిన ఈ సవాలును వైఎస్సార్సీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వీకరించారు. తాము కూడా చర్చకు సిద్ధమేనని, ఎక్కడికైనా వస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరుపక్షాల నేతలు పరస్పరం సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో ఇరు పార్టీల శ్రేణులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యాయి.

నరసరావుపేట పరిసరల్లో ఉద్రిక్తం

ఈ పరిణామాల నేపథ్యంలో నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు, నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన అధికారులు... ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, వైఎస్సార్సీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరినీ ముందుజాగ్రత్తగా గృహనిర్బంధం చేశారు. వారి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Next Story