నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీలు..

by Kodari Anjali |   (  Updated:2026-06-05 09:06:23  IST  )

జిల్లాలోని ఏనుగులగడ్డ ఇందిరానగర్‌లో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డీసీఏ అధికారుల దాడి నిర్వహించారు.

నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీలు..
X

దిశ, హన్మకొండ టౌన్: జిల్లాలోని ఏనుగులగడ్డ ఇందిరానగర్‌లో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డీసీఏ అధికారుల దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తి సరైన అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్న అధికారులు. మొత్తం 41 రకాల మందులు, అందులో 35 రకాల ఇన్‌స్టిట్యూషనల్ సప్లై మందులు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, బీపీ మందులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్లినిక్ నుంచి స్వాధీనం చేసుకున్న మందుల విలువ సుమారు రూ.10,000 అని తెలిపారు. క్లినిక్‌లో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ల వినియోగం ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని, మందుల నమూనాలను సేకరించి విశ్లేషణకు పంపారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లైసెన్స్ లేని వ్యక్తులు, క్వాక్‌లకు మందులు సరఫరా చేసే డీలర్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయని డీసీఏ అధికారులు హెచ్చరించారు.

Next Story