శివాజీ టీషర్ట్ వేసుకుని మద్యం మత్తులో చిందులు.. క్షమాపణలు చెబుతూ రితేష్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

నేను నా జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ మద్యం ముట్టలేదు, భవిష్యత్తులో కూడా ముట్టను. కాబట్టి నాపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు.

శివాజీ టీషర్ట్ వేసుకుని మద్యం మత్తులో చిందులు.. క్షమాపణలు చెబుతూ రితేష్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో, దర్శకుడు, హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ పీరియాడిక్ డ్రామా ‘రాజా శివాజీ’ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారీ కలెక్షన్లతో రికార్డుల వేట సాగిస్తోంది.కేవలం ఇండియాలోనూ రూ.114.14 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈనేపథ్యంలో.. రితేష్ దేశ్‌ముఖ్ ఈ విషయాన్ని ఎంజాయ్ చేయడానికి ఓ పార్టిని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. ఇక ఇందులో శివాజీ మహారాజ్ బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకుని ఉండటంతో పాటుగా డ్యాన్స్ చేయడంతో ఆయన మద్యం మత్తులో అలా చేశారంటూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. అంతేకాకుండా శివాజీని అవమానించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై స్పందిస్తూ.. రిలేష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "శివాజీ మహారాజ్‌ను అవమానించాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు.

సినిమా ప్రమోషన్స్ కోసం నేను ఆ టీషర్ట్ వేసుకున్నాను. ఆ రోజు ప్రమోషన్స్ ముగించుకుని నేరుగా ఈ ఈవెంట్‌కు రావడం వల్ల, అలసటలో టీషర్ట్ మార్చుకోవడం మర్చిపోయాను. ఇది కేవలం పొరపాటున జరిగింది తప్ప కావాలని చేసింది కాదు" అని వినయంగా చెప్పుకొచ్చారు. ఇక ఆ పార్టీలో రితేష్ మద్యం సేవించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. "నేను నా జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ మద్యం ముట్టలేదు, భవిష్యత్తులో కూడా ముట్టను. కాబట్టి నాపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పైగా ఆ వీడియో తీసిన వ్యక్తికి మా పార్టీకి ఎలాంటి ఆహ్వానం లేదు. దొంగచాటుగా ఆ వీడియో తీశారు" అని రితేష్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ ఎప్పటికీ తమకు ఒక ఆదర్శమని, ఆయనపై తనకున్న భక్తి, గౌరవం ఎప్పటికీ తగ్గవని రితేష్ దేశ్‌ముఖ్ తెలిపారు.

Next Story