నాకు భర్తగా అలాంటి మగాడే కావాలంటూ రెజీనా షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

తనకు కాబోయే వాడు ఇలాగే ఉండాలని పెద్దగా నిబంధనలు ఏమీ లేవని రెజినా అంటోంది. అయితే అతను మానసికంగా చాలా దృఢంగా ఉండాలని కోరుకుంటోంది.

నాకు  భర్తగా అలాంటి మగాడే కావాలంటూ రెజీనా షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రెజినా గత కొద్ది కాలంగా తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ష్లాష్‌బ్యాక్, మూకుతి అమ్మన్-2, హిందీలో ది వైవ్స్, సెక్షన్ 108 వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. సాధారణంగా హీరోయిన్లకు పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నలు ఎదురైనప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పి దాటవేస్తుంటారు. కానీ రెజినా మాత్రం చాలా ఓపెన్‌గా తన మనసులోని మాటను బయటపెట్టింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో తనకే తెలియదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తన జీవితంలో ఎవరూ లేరని, అలాంటప్పుడు పెళ్లి గురించి ముందే ఆలోచించి కంగారు పడాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి తన జీవితంలోకి వస్తే అప్పుడు పెళ్లి గురించి మాట్లాడొచ్చని చాలా ప్రాక్టికల్‌గా చెప్పింది.

తన పర్సనల్ లైఫ్ గురించి కూడా రెజినా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2020లో తనకు ఒక బ్రేకప్ అయిందని, ఆ తర్వాత మళ్లీ ప్రేమలో పడాలనే ఆలోచన రాలేదని తెలిపింది. ఆ బ్రేకప్ నుంచి తను చాలా నేర్చుకున్నానని, తన జీవితంలో భాగస్వామి ఉన్నా లేకపోయినా తన లైఫ్ స్టైల్ పెద్దగా మారదని పేర్కొంది. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, తనతో తానే గడుపుతూ సంతోషంగా ఉన్నానని చెప్పింది. తనకు కాబోయే వాడు ఇలాగే ఉండాలని పెద్దగా నిబంధనలు ఏమీ లేవని రెజినా అంటోంది. అయితే అతను మానసికంగా చాలా దృఢంగా ఉండాలని కోరుకుంటోంది. కేవలం శారీరక బలం కంటే మనోధైర్యం ఉన్న వ్యక్తికే తాను ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించింది. మొత్తానికి రెజినా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె అభిమానుల్లో చర్చకు దారితీస్తున్నాయి.

Next Story