గాదె ఇన్నయ్యకు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-05 07:21:43  IST  )

ఎన్‌ఐఏ కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గాదె ఇన్నయ్యకు నాంపల్లి కోర్టు రెండు నెలల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

గాదె ఇన్నయ్యకు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నమోదు చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ (TPF) ప్రతిప్రతినిధి, హక్కుల నాయకుడు గాదె ఇన్నయ్య (Gade Innayya)కు కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన 2 నెలల మధ్యంతర బెయిల్ (Interim Bail) మంజూరు చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం ఆయన చంచల్‌గూడ జైలు నుండి బెయిల్‌పై విడుదలయ్యారు.

గత కొంతకాలంగా ఎన్‌ఐఏ కేసులో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న గాదె ఇన్నయ్య.. తన వ్యక్తిగత, ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఆయనకు 2 నెలల పాటు తాత్కాలికంగా మధ్యంతర బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. బెయిల్ గడువు ముగిసిన తర్వాత తిరిగి కోర్టు ముందు, జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద ఎన్‌ఐఏ నమోదు చేసిన కేసుల్లో ఇన్నయ్య నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న సమయంలో ఆయన తల్లిదండ్రులు కూడా కాలం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన విడుదల కావడంతో ఇన్నయ్య కుటుంబ సభ్యులు, న్యాయవాదులు నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు.

Next Story