బైక్ పై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. తండ్రికి గాయాలు, కుమార్తెకు తృటిలో తప్పిన ప్రమాదం

by Jakkula.Mamatha |

మండల పరిధిలోని కాప్రాయపల్లి స్టేజీ వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది

బైక్ పై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. తండ్రికి గాయాలు, కుమార్తెకు తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ,ఆత్మకూరు(ఎం): మండల పరిధిలోని కాప్రాయపల్లి స్టేజీ వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. రహీంఖాన్‌పేట్ గ్రామానికి చెందిన బండారి రాములు తన కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై మోత్కూరు వెళ్తుండగా రహదారి పక్కన ఉన్న చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి బైక్‌పై పడింది. ఈ ఘటనలో రాములుకు స్వల్ప గాయాలు కాగా, ఆయన కుమార్తె సురక్షితంగా బయటపడింది. చెట్టు కొమ్మ బలంగా పడటంతో ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన రాములును చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. ఘటనతో కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాకాలం నేపథ్యంలో రహదారుల వెంట ఉన్న ప్రమాదకర చెట్ల కొమ్మలను తొలగించాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Next Story