- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడికి స్వాగతం.. శ్రమదానంతో స్కూల్ దారి శుభ్రం చేసిన సర్పంచ్
సోమవారం నుండి నూతన విద్యా సంవత్సరం చదువులు ఆరంభం కానున్న తరుణంలో మండల కేంద్రమైన రేగోడ్ లోని ప్రభుత్వ బడులు అపరిశుభ్రతతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి.

దిశ, ఖానాపురం : సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఖానాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్ సెకండరీ పాఠశాలలో శ్రమదాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మార్నింగ్ వాక్‌కు వచ్చిన యువకులు, గ్రామస్తులతో కలిసి సర్పంచ్ స్వయంగా పాఠశాల ఆవరణతో పాటు పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారిని శుభ్రం చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాల ఆవరణలో పెరిగిన ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. దీంతో పాములు, తేళ్లు వంటి విష కీటకాల బెడద తొలగి విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ గ్రామంలోని విద్యార్థులు కొత్త ఉత్సాహంతో బడికి వస్తారని, వారికి పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం అందరి బాధ్యత అని తెలిపారు. ‘మన ఊరు - మన బడి - మన బాధ్యత’ అనే నినాదంతో ఈ శ్రమదానం చేపట్టినట్టు తెలిపారు. యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ‘స్వచ్ఛ ఖానాపురం’ లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామన్నారు. శ్రమదానంలో పాల్గొన్న యువకులను సర్పంచ్ అభినందించారు. తమ చదువుకున్న పాఠశాలను స్వయంగా శుభ్రం చేసుకోవడం ఆనందంగా ఉందని యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువజన సంఘాల సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






