Medaram Jatara : గద్దెపై కొలువుదీరిన సారలమ్మ.. జనసంద్రమైన జంపన్న వాగు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-29 06:22:54  IST  )

మేడారం మహా జాతరలో భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది. బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత అశేష జనవాహిని మధ్య తరలివచ్చి గద్దెపై కొలువుదీరడంతో జాతరలో ప్రధాన ఘట్టం మొదలైంది.

Medaram Jatara : గద్దెపై కొలువుదీరిన సారలమ్మ.. జనసంద్రమైన జంపన్న వాగు
X

దిశ, మేడారం నెట్ వర్క్: మేడారం మహా జాతరలో భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది. బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత అశేష జనవాహిని మధ్య తరలివచ్చి గద్దెపై కొలువుదీరడంతో జాతరలో ప్రధాన ఘట్టం మొదలైంది. ఇక గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారి ఆగమనం ఉండటంతో, ఆ వేడుకను కళ్లారా వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్ల దర్శనానికి ముందు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో జంపన్న వాగు వేలాది మందితో కిటకిటలాడింది.

సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మేడారం అడవులన్నీ మారుమోగుతున్నాయి. గద్దెపై కొలువుదీరిన సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, తడి బట్టలతోనే అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించు కునేందుకు భక్తులు ఉత్సాహం చూపిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Similar News : పకడ్బందీగా కొనసాగుతున్న మేడారం మహా జాతర

Next Story