- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీడియా కాంట్రవర్సీలకే ప్రాధాన్యతనిస్తోంది.. సారాఖాన్

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగనా 'లాక్ అప్' రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ షోలో చేరేందుకు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండానే నిర్ణయం తీసుకున్నానంటోంది బుల్లితెర నటి సారా ఖాన్. ఈ మేరకు లాక్‌అప్‌లో కంటెస్టెంట్‌గా చాన్స్ రావడంపై స్పందించిన ఆమె.. 'ఈ షోలో ప్రదర్శన చేయాలని ఆహ్వానం అందగానే దేని గురించి ఆలోచించలేదు. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఎందుకంటే అలీతో విడాకులకు సంబంధించిన నిజాలన్నీ ప్రజలకు తెలియజేయాలి. అయితే నా జీవితంలో ఇదొక భిన్నమైన అనుభవం.
ఈ షో ద్వారా నేను కొత్త విషయాలు నేర్చుకుంటానని అనుకుంటున్నాను. ఇందులో ప్రదర్శన చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాను' అని వివరించింది. ఈ క్రమంలోనే తన జీవితాన్ని వివాదాస్పదంగా మార్చేందుకు మీడియా ఆసక్తి చూపిందన్న ఆమె.. 'నా వ్యక్తిగత జీవితం గురించి ఇతరులతో చర్చించడం ఇష్టం లేదు. కానీ మీడియా నా పర్సనల్ లైఫ్ గురించి ఆరా తీస్తూ.. పరువు ప్రతిష్టలను దిగజార్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ విషయంపై కూడా మాట్లాడలనుకుంటున్నాను' అంటూ సారాఖాన్ చెప్పుకొచ్చింది.






