- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన సంతోష్ రావు సిట్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావును సిట్ విచారించింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావును సిట్ విచారించింది. జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో జరిగిన ఈ విచారణ సుమారు 5 నుంచి 7 గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు పాత్ర ఏమిటి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును ఆ పదవిలో నియమించిన నిర్ణయం ఎవరిది, ఆ నిర్ణయంలో సంతోష్ రావు పాత్ర ఎంతవరకు ఉందన్న అంశాలపై సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, పలు డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రశ్నలు అడిగి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ అనంతరం సంతోష్ రావు బయటికి వచ్చారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలవవచ్చని సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను సిట్ ప్రశ్నించగా, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సహా పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలతో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతుండగా, ఈ విచారణ తర్వాత కేసులో మరిన్ని కీలక మలుపులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.






