నారావారిపల్లిలో ఘనంగా సంక్రాంతి పండుగ.. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

by Malleboina Mahesh |

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలను తన స్వగ్రామమైన నారావారిపల్లి ప్రజలతో కలిసి ఘనంగా చేసుకుంటారు.

నారావారిపల్లిలో ఘనంగా సంక్రాంతి పండుగ.. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలను (Sankranti celebrations) తన స్వగ్రామమైన నారావారిపల్లి (Naravaripalli) ప్రజలతో కలిసి ఘనంగా చేసుకుంటారు. ఇందులో భాగంగా నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి తన తల్లిదండ్రులు, తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. అనంతరం, నారావారిపల్లిలో వెలసిన గ్రామ దేవత నాగులమ్మ పుట్ట వద్ద సీఎం కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పండుగ వాతావరణంలో సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ వారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు.

నేటి మధ్యాహ్నం పర్యటన ముగింపు దశకు చేరుకోనుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి, ప్రస్తుత రాజకీయ మరియు అభివృద్ధి అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. మీడియా సమావేశం ముగిసిన తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా గ్రామంలో మరియు హెలిప్యాడ్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Next Story