ఆ ఆటగాడికి టీ20 వరల్డ్ కప్‌ జట్టులో చోటు ఖాయం!?

by Vinod kumar |   (  Updated:2022-03-22 11:59:05  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత టీ20 అత్యుత్తమ ఆటగాళ్లలో శాంసన్‌ - Sangakkara said he hoped Samson would make the India squad for this year's T20 World Cup

ఆ ఆటగాడికి టీ20 వరల్డ్ కప్‌ జట్టులో చోటు ఖాయం!?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత టీ20 అత్యుత్తమ ఆటగాళ్లలో శాంసన్‌ ఒకడని రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజు శాంసన్‌ కొనసాగుతున్నాడు. శాంసన్ తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగలడు అని కొనియాడాడు.

నేను రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అతడి గురించి తెలుసుకున్నాను. అతడికి రాజస్థాన్ రాయల్స్‌ జట్టు పట్ల మక్కువ ఎక్కువ. శాంసన్ తన ఐపీఎల్‌ కెరీర్‌ను రాజస్థాన్‌తో ప్రారంభించాడు. అదే విధం‍గా అతడు కెప్టెన్సీ పరంగా కూడా అద్భుతమైన స్కిల్స్‌ను కలిగి ఉన్నాడు.

శాంసన్‌కి ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టులో చోటు దక్కుతుందని ఆశిస్తున్నాను అని సంగక్కర పేర్కొన్నాడు. లాస్ట్ సీజన్ జరిగిన ఐపీఎల్‌లో శాంసన్ 14 మ్యాచ్‌లు ఆడి 484 రన్స్ సాధించాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్‌ తన తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మార్చి 29న తలపడనుంది.

Next Story