అధికార గర్వానికి సామాన్యుల బుద్ధి.. సందేశ్‌ఖాలీ గ్యాంగ్ రేప్ బాధితురాలు భారీ విజయం!

by Malleboina Mahesh |

బెంగాల్ ఎన్నికల్లో బాధితుల గళం విన్పించింది. రేఖా పాత్ర, రత్న దేబ్‌నాథ్ మరియు కలిత మాజీ వంటి సామాన్యులు రాజకీయ ఉద్ధండులను మట్టికరిపించి అఖండ విజయం సాధించారు.

అధికార గర్వానికి సామాన్యుల బుద్ధి.. సందేశ్‌ఖాలీ గ్యాంగ్ రేప్ బాధితురాలు భారీ విజయం!
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సామాన్యుల గళం వినిపించింది. సందేశ్‌ఖాలీ (Sandeshkhali) సామూహిక అత్యాచార బాధితురాలు (Gang Rape victim) రేఖా పాత్ర తనపై దాడులకు పాల్పడిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థిపై 5,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అలాగే, కోల్‌కతా ఆర్‌.జి. కర్ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ తల్లి రత్న దేబ్‌నాథ్ కూడా ఎన్నికల బరిలో నిలిచి, నిందితులను వెనకేసుకొచ్చిన అధికార పార్టీ అభ్యర్థిని 28,000 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించి సంచలనం సృష్టించారు.

మరోవైపు, నిరుపేద కుటుంబానికి చెందిన కలిత మాజీ (Kalita Maji) అనే గృహ కార్మికురాలు కూడా అద్భుత విజయాన్ని అందుకున్నారు. నాలుగు ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె, బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్న కారణంతో గతంలో టీఎంసీ (TMC) కార్యకర్తల వేధింపులకు గురయ్యారు. అయినప్పటికీ ధైర్యంగా పోరాడి టీఎంసీ అభ్యర్థిపై 12,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితాలు భారత ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో నిరూపిస్తున్నాయని, సామాన్యులే అసలైన విజేతలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story