- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మక్క–సారలమ్మ జాతర ప్రధాన పూజారి మృతి
by Batti.Sumithra |
మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర ప్రధాన పూజారి గుల్లపల్లి సాంబశివరావు (65) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు.

X
దిశ, ఆత్మకూర్ : మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర ప్రధాన పూజారి గుల్లపల్లి సాంబశివరావు (65) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరలో గద్దెలపైకి పసుపు, కుంకుమలను చేర్చే కీలక ఘట్టం పూజారి సాంబశివరావు నేతృత్వంలో నిర్వహించబడేది. జాతరను విజయవంతంగా నిర్వహించడంలో ఆయన విశేష కృషి చేశారు. పూజారి సాంబశివరావు మృతి పట్ల సహచర పూజారులు, ఎండోమెంట్స్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, భక్తులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి అగ్రంపహాడ్ జాతరకు, భక్తులకు తీరని లోటని వారు పేర్కొన్నారు.
Next Story






