విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్న సమంత

by Dishanational2 |
విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్న సమంత
X

దిశ, వెబ్‌డెస్క్ : మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసరం లేదు. విజయ్ దేవరకొండ ఫొటోగ్రాఫర్ గానూ సమంత సావిత్ర జీవితంపై రీసెర్చ్ చేసే పాత్రికుయురాలిగా కనిపిస్తూ ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు. వీరి కెమిస్ట్రీని చూసి వీరిద్దరు కలిసి సినిమా తీస్తే బాగుండు అనుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇప్పుడు అదే నిజం కాబోతుంది. సెన్సేషన్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ సమంత కాంబోలో సినిమా రానుందని టాక్. మజిలీ, శివ నిర్వాణ ఫేమ్.. శివ నిర్వాణ దర్శకత్వంలో రానున్న చిత్రంలో వీరిద్దరు జోడీ కట్టనున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్‌లో హల్‌చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి వైరల్ అవుతోంది.




ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా.. రొమాన్స్‌తో కూడిన ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రమిదని తెలుస్తోంది. కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా దాదాపు 60% కథ అక్కడే సాగుతుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. అలాగే కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో మణిరత్నం తెరకెక్కించిన రోజా కథను దాదాపు పోలి ఉంటుందని సమాచారం. ఇక ఇందులో విజయ్ ఓ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

Next Story