Samantha: రెండో భర్త కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సమంత.. కలిసొచ్చేనా?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

Samantha: రెండో భర్త కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సమంత.. కలిసొచ్చేనా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత తన కెరీర్‌పై ఫోకస్ పెట్టిన సామ్, గత ఏడాది డిసెంబర్‌లో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా, సమంత తన భర్త రాజ్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చర్చకు దారితీస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru) క్రియేటర్ గా సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ అనే ఫ్యామిలీ, యాక్షన్, డ్రామాగా తెరకెక్కుతోంది.

ఈ సినిమా టైటిల్ కార్డులో సమంత తన పేరును ‘‘సమంత నిడిమోరు’’గా మార్చుకోబోతోందని సమాచారం. గతంలో చైతన్యతో పెళ్లయ్యాక తన పేరును సమంత అక్కినేనిగా మార్చుకున్న సామ్, ఇప్పుడు రెండో భర్త ఇంటి పేరును తన పేరు పక్కన చేర్చుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ద్వారా సమంత మళ్ళీ ఫామ్‌లోకి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ పేరు మార్పు ఆమె కెరీర్‌కు ఎంతవరకు కలిసొస్తుంది? ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో సామ్ మళ్ళీ నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలబడుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజ్ పేరు సామ్ కెరీర్‌కు ప్లస్ అవుతుందా? లేక ఇండస్ట్రీకే దూరం అయ్యేలా చేస్తుందా? అని నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే కెరీర్ మళ్లీ ఫామ్‌లోకి రాబోతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం అవసరమా?అని అంటున్నారు.

Next Story