సమంతకు ఏమైంది.. షూటింగ్ మధ్యలోనే అలా చేసిన హాట్ బ్యూటీ..?

by Disha Web Desk 19 |
సమంతకు ఏమైంది.. షూటింగ్ మధ్యలోనే అలా చేసిన హాట్ బ్యూటీ..?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇక సామ్, అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నాక.. ఇక్కడి నుండి మకాం మార్చి బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ హాట్ బ్యూటీ దక్షిణాది సినిమాలపై మునపటిలా ఆసక్తి చూపడం లేదని.. బాలీవుడ్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా, వర్క్ విషయంలో చాలా సీరియస్‌గా, క్రమశిక్షణగా ఉండే సమంత.. ఇటీవల ఓ సినిమా షూటింగ్ జరగుతుండగా.. సెట్‌ నుండి మధ్యలోనే వెళ్లిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో డెడికేటెడ్‌గా ఉండే సామ్.. ఒక్కసారిగా ఇలా చేయడంతో అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత సౌత్ ఇండస్ట్రీకి దూరం అయి.. బాలీవుడ్‌లో పాగ వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని చర్చించుకుంటున్నారు. కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్.. ఇటీవల హాట్ డోస్ పెంచి అందాలు అరబోస్తుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంది.

Next Story

Most Viewed