- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిట్ విచారణ పారదర్శకంగా సాగుతోంది : సజ్జనార్
by Muthe.Rajitha |
కేసీఆర్ పై నేడు జరిగిన సిట్ విచారణ పూర్తయిందని సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారించడం పూర్తయ్యిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. "ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా నేడు కేసీఆర్ ను SIT విచారించింది. విచారణ పూర్తిగా చట్టపరంగా, నిష్పక్షపాతంగా కొనసాగుతోంది" అని ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ పాలనలో పనిచేసిన పలువురు ఉన్నతాధికారులతోపాటు, గులాబీ అగ్రనేతలందరినీ సిట్ విచారించింది. ఈ కేసు తదుపరి దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.
Next Story






