సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ ప్రకటన

by Muthe.Rajitha |

భారత బ్యాడ్మింటన్‌కు దిక్సూచిగా నిలిచిన సైనా నెహ్వాల్‌ రిటైర్మెంట్ ప్రకటించారు.

సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : భారత బ్యాడ్మింటన్‌కు దిక్సూచిగా నిలిచిన సైనా నెహ్వాల్‌ రిటైర్మెంట్ ప్రకటించారు. తాను అంతర్జాతీయ పోటీల నుంచి రిటైర్ అయినట్లు సైనా ధృవీకరించారు. అయితే గత రెండేళ్లుగా క్రానిక్ మోకాలి నొప్పితో తీవ్రంగా బాధపడుతున్న సైనా.. తన శరీరం ఎలైట్ స్పోర్ట్స్ అవసరాలను తట్టుకోలేకపోతుందని పేర్కొంది. సోమవారం సుభోజిత్ ఘోష్‌తో చేసిన ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించారు. 2023 జూన్ తర్వాత నుంచి సైనా ఎలాంటి అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనలేదు.

అయితే రిటైర్మెంట్ పై ఎలాంటి ఫార్మల్ అనౌన్స్‌మెంట్ అవసరం లేదని ఆమె భావించారు. "నేను నా ఇష్టంతోనే ఆటలోకి వచ్చాను, అలాగే నా ఇష్టంతోనే బయటకు వచ్చాను" అని చెప్పింది. సైనా కెరీర్‌లో 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి భారత మహిళల బ్యాడ్మింటన్‌లో తొలి ఒలింపిక్ మెడల్ సాధించిన ఘనత దక్కించుకుంది. ఆమె మాజీ వరల్డ్ నెంబర్ వన్‌గా నిలిచిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే రెండు కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్స్, ఆసియా గేమ్స్ బ్రాంజ్ మెడల్స్, అనేక BWF సూపర్ సిరీస్ టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.

భారత మహిళల బ్యాడ్మింటన్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ట్రయల్‌బ్లేజర్‌గా సైనా నిలిచారు. పీవీ సింధు, లక్ష్య సేన్ వంటి కొత్త తరం ఆటగాళ్లకు గొప్ప ప్రేరణ. రిటైర్మెంట్ తర్వాత హర్యానాలో ఒక బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయాలని సైనా భావిస్తున్నట్టు సమాచారం.

Next Story