- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇంటర్నేషనల్ అవార్డ్కు ఎంపికైన కోదాడ వాసి..
by Satheesh |

X
దిశ, కోదాడ: కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకులు సైదులు ఇంటర్నేషనల్ గోల్డెన్ హ్యుమానిటీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలో హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ చేతుల మీదుగా అవార్డును తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, ఇతడు గతంలో కూడా అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నాడు. దశాబ్ద కాలంగా సైదులు సూక్ష్మ ఆస్తులపై అద్భుతమైన కళాఖండాలు చెక్కుతూ.. పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఈ సందర్భంగా పలువురు సైదులును అభినందించారు.
Next Story