మాస్టర్‌ చెఫ్ ఇండియాలో తెలంగాణ జంట రికార్డు.. రన్నరప్‌గా నిలిచిన సాయి శ్రీ, చందన!

by Malleboina Mahesh |

మాస్టర్‌చెఫ్ ఇండియా-10లో రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ జోడీ సాయి శ్రీ, చందన. మంచిర్యాల తల్లి-కూతుళ్ల అద్భుత విజయంపై తెలుగు రాష్ట్రాల్లో హర్షం.

మాస్టర్‌ చెఫ్ ఇండియాలో తెలంగాణ జంట రికార్డు.. రన్నరప్‌గా నిలిచిన సాయి శ్రీ, చందన!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ రియాలిటీ షో మాస్టర్‌చెఫ్ ఇండియా (MasterChef India) ఫ్రోగ్రామ్ కి భారత్ లో అనేక ఆధరణ ఉంది. ఇప్పటికే వరుసగా 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. తాజాగా సీజన్-10 కు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ మాస్టర్‌చెఫ్ ఇండియా తెలంగాణకు చెందిన తల్లి-కూతుళ్ల జోడీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మంచిర్యాల జిల్లాకు చెందిన రాచకొండ సాయి శ్రీ, ఆమె తల్లి చందన, దేశవ్యాప్తంగా వేలాది మంది పోటీ పడిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో రన్నరప్‌ (Runner-up)గా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈ సీజన్‌లో మాస్టర్‌చెఫ్ తొలిసారిగా ప్రవేశపెట్టిన 'జోడీ ఫార్మాట్'లో పాల్గొన్న వీరు, తమదైన వంటకాలతో జడ్జీల మనసు గెలుచుకున్నారు.

అలాగే ఈ షోలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక జోడీగా సాయి శ్రీ-చందన (Sai Sri-Chandana) అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్-12, టాప్-5 దశలను దాటుకుని ఫైనల్స్‌కు చేరుకున్నారు. గ్రాండ్ ఫినాలే (grand finale)లో హోరాహోరీగా తలపడి టాప్-2లో నిలిచి రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, జాతీయ స్థాయి వేదికపై తెలుగు రుచుల సత్తా చాటడం పట్ల నెటిజన్లు, తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మాస్టర్‌చెఫ్ ఇండియా ఫైనల్ అత్యంత ఉత్కంఠభరితమైన పోరు సాగింది. ఈ సీజన్ విజేతగా కోల్‌కతాకు చెందిన సుదీప్తా సర్కార్ (Sudipta Sarkar) నిలిచారు.

Next Story