Sai Pallavi: అదొక పవిత్రమైన దేవాలయం అంటూ సాయిపల్లవి ఎమోషనల్ పోస్ట్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2024-10-28 15:51:51  IST  )

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi), శివ కార్తీకేయన్(Shiva Karthikeyan) జంటగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’(Amaran).

Sai Pallavi: అదొక పవిత్రమైన  దేవాలయం అంటూ సాయిపల్లవి ఎమోషనల్ పోస్ట్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi), శివ కార్తీకేయన్(Shiva Karthikeyan) జంటగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’(Amaran). మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్‍కుమార్ పెరియసామి(Rajkumar Periasamy) దర్శకత్వం వహించారు. అయితే ‘అమరన్’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషల్లో అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి(Sai Pallavi) నేషనల్ వార్ మెమోరియల్ వద్ద దేశం కోసం మరణించిన సైనికులకు నివాళులు అర్పించింది. తాజాగా, ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

‘‘నేను అమరన్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు నేషనల్ వార్ మెమోరియల్(National War Memorial) సందర్శించాలి అనుకున్నాను. ఇటీవల కొన్ని రోజుల క్రితం వెళ్ళాను. మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గురించి ఇటు కల లాంటి పలకల రూపంలో వారి వివరాలు ఉంచే పవిత్రమైన ఆలయం ఇది. మేజర్ ముకుంద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సింగ్(Vikram Singh) లకు నివాళులు అర్పిస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా అక్కడ తీసుకున్న ఫొటోలు కూడా షేర్ చేసింది. ప్రజెంట్ సాయి పల్లవి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More...

Boycott Sai Pallavi: సాయి పల్లవికి బిగ్ షాక్.. బాయ్‌కాట్ అంటూ నెట్టింట ట్రోల్స్


Next Story