సాగర్ ఎడమ కాలువలో యువకుడు గల్లంతు.. ఫ్రెండ్స్‌కు చనిపోతున్నానంటూ మెసేజ్

by Javid Pasha |

దిశ,హాలియ : సాగర్ ఎడమ కాలువలో యువకుడు గల్లంతైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.. Latest Telugu News..

సాగర్ ఎడమ కాలువలో యువకుడు గల్లంతు.. ఫ్రెండ్స్‌కు చనిపోతున్నానంటూ మెసేజ్
X

దిశ,హాలియ : సాగర్ ఎడమ కాలువలో యువకుడు గల్లంతైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన బండి వెంకటయ్య పెద్ద కొడుకు బండి పవన్ కుమార్ ( 22 ) డిగ్రీ రెండవ ఏడాది చదువుతున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుండి వెళ్ళి రాత్రి సుమారు 10 గంటల సమయంలో తనకు బతకాలని లేదని, తాను యన్‌యస్‌పీ కాలువ కట్ట మీద ఉన్నానని, తాను కాలువలోకి దూకి చనిపోతున్నానని తన స్నేహితులకు మెసేజ్ చేసినాడని పోలీసులు తెలిపారు. మెసేజ్ వచ్చిన వెంటనే అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు వెళ్ళి చూడగా కాలువ కట్ట మీద పవన్‌కు సంబందించిన కళ్ళజోడు, చెప్పులు, సెల్ ఫోన్ ఉన్నాయి. బండి వెంకటయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐడీ క్రాంతి కుమార్ కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

Next Story