కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా.. బండి సంజయ్ భావోద్వేగ సందేశం

by Malleboina Mahesh |

కరీంనగర్ విజయంపై బండి సంజయ్ భావోద్వేగం! సామాన్య కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి కాషాయ పీఠాన్ని చూడటం ఒక కలగా అభివర్ణన.

కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా.. బండి సంజయ్ భావోద్వేగ సందేశం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోకి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో.. కరీంనగర్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైందని బండి సంజయ్ పేర్కొంటూ.. ఎక్స్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఆయన తన ట్వీట్‌లో "నగరంలో మొట్టమొదటిసారిగా బీజేపీ మేయర్ ప్రమాణ స్వీకారం చేయడం ఒక అద్భుతమని. ఈ విజయాన్ని అందించిన ఓటర్లకు, ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతకు ఆయన తలవంచి నమస్కరించారు. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

నా వ్యక్తిగత ప్రయాణంలో ఇది చిరస్మరణీయం

"ఒక సామాన్య కార్పొరేటర్‌గా వార్డు వార్డు తిరిగిన స్థాయి నుండి.. నేడు కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం పై కాషాయ జెండా రెపరెపలాడటం చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇది నా వ్యక్తిగత విజయం కూడా. సామాన్య కార్యకర్తలను సైతం చరిత్ర సృష్టించే స్థాయికి తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన గర్వంగా ప్రకటించారు."

కార్యకర్తల ధైర్యానికి నిదర్శనం..

అనేక కుట్రలు, బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనా బెదరకుండా నిలబడ్డ ప్రతి బీజేపీ కార్యకర్తకు ఈ విజయం అంకితమని బండి సంజయ్ అన్నారు. ముఖ్యంగా ఎంఐఎం పార్టీ కార్యాలయం ఉన్న వార్డులోనే కాషాయ జెండాను ఎగురవేసి బీజేపీ కార్యకర్తలు తమ సత్తా చాటారని, ఆ దృశ్యం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అన్ని అడ్డంకులను అధిగమించి తాము చెప్పినట్టే విజయం సాధించామని ఈ సందర్భంగా బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story