Rishabh Pant: సచిన్ రికార్డ్ బద్దలుకొట్టిన రిషబ్ పంత్..

by Satheesh |   (  Updated:2022-07-02 12:31:01  IST  )

Rishabh Pant Breaks Sachin Tendulkar Record| ఇండియా, ఇంగ్లాండ్‌ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతోన్న రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్లు పలు రికార్డ్‌లు బద్దలుకొడుతున్నారు. ఇప్పటికే బుమ్రా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు

Rishabh Pant Breaks Sachin Tendulkar Record
X

దిశ, వెబ్‌డెస్క్: Rishabh Pant Breaks Sachin Tendulkar Record| ఇండియా, ఇంగ్లాండ్‌ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతోన్న రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్లు పలు రికార్డ్‌లు బద్దలుకొడుతున్నారు. ఇప్పటికే బుమ్రా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, యంగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. క్రికెట్‌లో అతిచిన్న వయస్సులో వంద సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. సచిన్ 25ఏళ్ల వయసులో 100 సిక్సుల మైలురాయిని అందుకోగా.. పంత్ కేవలం 24ఏళ్లకే 100 సిక్సులు కొట్టి రికార్డ్ సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పంత్ జట్టును ఆదుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఇండియాను రేస్‌లో నిలబెట్టాడు. పంత్, జడేజా సెంచరీలతో రాణించడంతో ఇండియా 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Next Story