దంతెవాడకు సచిన్ టెండూల్కర్.. కారణం ఇదేనా!

by Muthe.Rajitha |

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడలో పర్యటించడం దేశ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

దంతెవాడకు సచిన్ టెండూల్కర్.. కారణం ఇదేనా!
X

దిశ, వెబ్ డెస్క్ : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడలో పర్యటించడం దేశ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, మాన్ దేశి ఫౌండేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా చేపట్టిన "మైదాన్ కప్" కార్యక్రమంలో భాగంగా సుమారు 50 గ్రామాల్లో క్రీడా మైదానాలను నిర్మించి, 10,000 మందికి పైగా ఆదివాసీ యువతను "గన్స్ నుంచి గ్రౌండ్స్ వైపు" మళ్లించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ఈ సందర్భంగా పనేడాలో నూతనంగా నిర్మించిన క్రికెట్ స్టేడియంను ప్రారంభించనున్న సచిన్, తన పట్టుదలతో గతంలోనే మాస్టర్ బ్లాస్టర్ మనసు గెలుచుకున్న దివ్యాంగ యువకుడు మద్దారామ్‌ను కూడా ప్రత్యేకంగా కలవనున్నారు.

2020లో నేలపై పాకుతూ క్రికెట్ ఆడుతున్న మద్దారామ్ వీడియోను చూసి చలించిపోయిన సచిన్, అప్పట్లోనే అతనికి క్రికెట్ కిట్ పంపించి ప్రోత్సహించగా, ఇప్పుడు స్వయంగా తన అభిమాన దైవం తన ఊరికే వస్తుండటంతో సచిన్‌తో కలిసి క్రికెట్ ఆడాలన్న మద్దారామ్ కల నెరవేరబోతోంది. ఈ పర్యటన దంతేవాడలోని యువతలో కొత్త ఆశలను చిగురింపజేయడమే కాకుండా, క్రీడల ద్వారా సామాజిక మార్పును తీసుకురావడంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోనుంది.

Next Story