శబరిమల గోల్డ్ స్కామ్: మాజీ టీడీబీ ప్రెసిడెంట్‌కు బెయిల్ నిరాకరించిన కేరళ హైకోర్టు

by Malleboina Mahesh |

శబరిమల అయ్యప్ప స్వామి గర్భాలయం (శ్రీకోవిల్) ద్వారాలకు అమర్చిన బంగారు రేకులు, ద్వారపాలక విగ్రహాల వద్ద బంగారం చోరీకి గురైన కేసులో కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

శబరిమల గోల్డ్ స్కామ్: మాజీ టీడీబీ ప్రెసిడెంట్‌కు బెయిల్ నిరాకరించిన కేరళ హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: శబరిమల అయ్యప్ప స్వామి గర్భాలయం (Srikovil) ద్వారాలకు అమర్చిన బంగారు రేకులు, ద్వారపాలక విగ్రహాల వద్ద బంగారం చోరీకి గురైన కేసులో కేరళ హైకోర్టు (Kerala High Court) సంచలన నిర్ణయం తీసుకుంది. టీడీబీ మాజీ అధ్యక్షుడు ఎ. పద్మ కుమార్, మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి. మురారి బాబు, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నగల వ్యాపారి రొడ్డం పాండురంగయ్య నాగ గోవర్ధన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులను జస్టిస్ ఎ. బద్రుద్దీన్ (Justice A. Badruddin) తిరస్కరించారు. నిందితులపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని, దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.

2019లో శబరిమల ఆలయ పునరుద్ధరణ పనుల సమయంలో శ్రీకోవిల్ (Srikovil) ద్వారాలకు ఉన్న బంగారు కవచాలను మరమ్మతుల కోసం తొలగించారు. అయితే, ఆ పనుల తర్వాత తిరిగి అప్పగించిన బంగారు రేకులలో సుమారు 4 కిలోల బంగారం తగ్గిందని ఆడిట్‌లో తేలింది. పద్మ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు ఈ పనులను అప్పగించారని, అధికారిక పత్రాలలో 'బంగారు రేకులను' కేవలం 'రాగి రేకులుగా' పేర్కొని మోసానికి పాల్పడ్డారని సిట్ (SIT) ఆరోపిస్తోంది. ఈ కుట్రలో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పట్టికి పద్మ కుమార్ సహకరించారని దర్యాప్తులో తేలడంతో గత నవంబర్‌లో ఆయన్ని అరెస్ట్ చేశారు.

Next Story