డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ సిగరేట్ తాగిన రియాన్ పరాగ్.. క్రిమినల్ కేసు..?

by Malleboina Mahesh |

ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ వీడియో వైరల్! డ్రెస్సింగ్ రూమ్‌లో నిబంధనల ఉల్లంఘన. జరిమానాతో పాటు సస్పెన్షన్ పొంచి ఉన్న ముప్పు.

డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ సిగరేట్ తాగిన రియాన్ పరాగ్.. క్రిమినల్ కేసు..?
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ (Ryan Parag) చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో పరాగ్ 'వేపింగ్' (ఇ-సిగరెట్ తాగడం) చేస్తున్న దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారంలో కెమెరాకు చిక్కాయి. రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 16వ ఓవర్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పాటు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా స్టేడియం ప్రాంగణం, డ్రెస్సింగ్ రూమ్‌లో ధూమపానం చేయడం ఐసీసీ, బీసీసీఐ నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధం.

ఈ ఘటనపై బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా భారత్‌లో 2019 నుండి ఇ-సిగరెట్ల విక్రయం, వాడకంపై చట్టపరంగా నిషేధం ఉన్న నేపథ్యంలో, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే పరాగ్‌పై భారీ జరిమానాతో పాటు మ్యాచ్ సస్పెన్షన్ విధించే ప్రమాదం ఉంది. అలాగే నిబంధనల ప్రకారం అతని పై క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన కెప్టెన్ హోదాలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటంపై నెటిజన్లు, మాజీ క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం లేదా బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story