రష్యా డ్రోన్ దాడులు.. 15 మంది మృతి

by Muthe.Rajitha |

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులు జరిపింది.

రష్యా డ్రోన్ దాడులు.. 15 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులు జరిపింది. తాజాగా నిప్రో నగరంపై రష్యా డ్రోన్‌ దాడులకు తెగబడింది. గనుల్లో పని చేసి ఇంటికి వెళ్తున్న కార్మికుల బస్సుపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది గని కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు తమ సంస్థకు చెందినదేనని ఉక్రెయిన్‌లోని అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ డీటీఈకే వెల్లడించింది. నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని డీటీఈకే గనులపై రష్యా ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందని ఉక్రెయిన ఆరోపించింది.

అయితే తీవ్రమైన చలి కారణంగా దాడులను తాత్కాలికంగా ఆపుతామని రష్యా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన కొద్ది రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం. మరోవైపు అమెరికా, ఉక్రెయిన్‌, రష్యాల మధ్య మరో విడత త్రైపాక్షిక చర్చలు జరగనున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో అబుదాబిలో ఈ సమావేశాలు జరగనున్నట్టు సమాచారం.

Next Story