అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రష్యా గుడ్‌బై.. వెల్లడించిన స్పేస్ ఏజెన్సీ..

by Dishafeatures2 |
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రష్యా గుడ్‌బై.. వెల్లడించిన స్పేస్ ఏజెన్సీ..
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విషయంలో రష్యా షాకింగ్ డెసిషన్ తీసుకుంది. స్పేస్ స్టేషన్‌ నుంచి వైదొలగనున్నట్లు రష్యా అధికారులు వెల్లడించారు. రష్యా స్నేస్ ఏజెన్సీ రొస్కోస్‌మోస్ చీఫ్ యూరీ బొరిసోవ్ ఈ మేరకు విషయాన్ని తెలిపారు. 2024 తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి రష్యా తప్పుకోనుందని ఆయన అన్నారు. అంతేకాకుండా 2024 నుంచి రష్యా సరికొత్త పరిశోధనపై దృష్టి సారించనుందని, అప్పటి నుంచి రష్యా తన సొంత ఆర్బిటర్ స్టేషన్‌ను ప్రారంభించనుందని ఆయన వెల్లడించారు. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998లో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల భాగస్వామ్య ప్రాజెక్ట్‌గా లాంచ్ చేయబడింది. కానీ ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా పరిస్థితులు మారడం, ప్రతి దేశం తమ సొంత టెక్నాలజీ పరంగా సరికొత్త స్థాయికి చేరుకున్నాయి. దానికి తోడుగా తమ ప్రైవసీ కోసం ప్రతి దేశం వినూత్న నిర్ణయాలను తీసుకుంటున్నాయి. అందులో భాగంగా రష్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని, అమెరికాతో గత కొంతకాలంగా చెడిన సంబంధాలను దృష్టిలో పెట్టుకుని రష్యా ఈ నిర్ణయానికి వచ్చిందని నిపుణులు అంటున్నారు. ఏదిఏమైనా రష్యా తీసుకున్న నిర్ణయం స్పేస్ ఏజెన్సీలను కాస్త షాక్‌కు గురిచేస్తున్నాయి.


Next Story

Most Viewed