కార్పొరేటర్ అరెస్ట్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

by Disha Web Desk 23 |
కార్పొరేటర్ అరెస్ట్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
X

దిశ, వరంగల్ : 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి ఓ వ్యక్తిని భూమి నుంచి వెళ్లకపోతే చంపుతానని కులం పేరుతో తిట్టాడని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ తెలిపారు. పూర్తి వివరాల ప్రకారం పసునూరి అరవింద్ అనే వ్యక్తికి తన తాత అగయ్య వాటాకు రావలసిన 212 గజాల ప్లాట్ అండర్ రైల్వే గేటు ప్రాంతంలో కరీమాబాద్ కుమ్మరి వాడ లో ఉందని, దాన్ని 2012లో తన పెద్ద నాన్నలు పసునూరి ఎల్లాస్వామీ, పసునూరి రాజేంద్రప్రసాద్ లు తన నాన్న గోపి పేరు మీద ఉన్న 17-5-619 గల నెంబర్ తన ఇంటిని కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని కొంత డబ్బును అడ్వాన్స్ గా ఇచ్చామని కారణంతో, మేము స్థానికంగా లేమని అదునుగా భావించి ఆ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపాడు.

అయితే ఫిబ్రవరి 12వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అరవింద్ కరీమాబాద్ కుమ్మరవాడలో ఉన్న తన ప్లాట్ వద్ద ఉండగా స్థానిక కార్పొరేటర్ మరపుల రవి, సపోర్టుతో తన పెద్దనాన్న పసునూరి ఎల్లా స్వామి, పెద్దమ్మ ఎలీషా వారి ముగ్గురు కొడుకులు తనను ఉద్దేశించి ఇంటి ప్లాట్ అమ్ముకొని ఇప్పుడు మాది అంటున్నారని ఈ భూమి నుంచి వెళ్లకపోతే చంపుతానని కులం పేరుతో తిట్టి నువ్వు ఎంత నీ బతుకు ఎంత అని అవమానించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడు 40వ డివిజన్ కార్పొరేటర్ మరపల్లి రవిని అరెస్ట్ పరకాల జైలు కు తరలించినట్లు వరంగల్ ఏసీపీ బి.నందిరాం నాయక్ తెలిపారు.

Next Story