KTR పేరుకు కొత్త ఫుల్ ఫామ్ చెప్పిన కాంగ్రెస్ నేత

by Rajesh |
KTR పేరుకు కొత్త ఫుల్ ఫామ్ చెప్పిన కాంగ్రెస్ నేత
X

దిశ, తెలంగాణ బ్యూరో : “కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు”అని కాంగ్రెస్ కరీంనగర్ క్యాండిడేట్ వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు. గురువారం ఆయన గాంధీభవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ సిరిసిల్ల కు వలస పక్షి అని ఎద్దేవా చేశారు. నేతన్నల చావుకు కేటీఆరే కారణమన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన నిధులను కాంగ్రెస్ అధికారంలో కి రాగానే సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ లను సిరిసిల్లా ప్రజలు నమ్మొద్దని రిక్వెస్టు చేస్తున్నానని కోరారు. ఇక ఎన్నికలు కాక ముందే బీఆర్ఎస్ ,బీజేపీ తో కుమ్మక్కు అయ్యిందన్నారు. అందుకే నామా నాగేశ్వరరావు గెలిస్తే, కేంద్ర మంత్రి అవుతాడనే ప్రచారం స్వయంగా కేసీఆర్ చేశాడని గుర్తు చేశారు.

కేంద్ర మంత్రి ఎలా అవుతాడో? ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందన్నారు. కేసీఆర్ ,కేటీఆర్ అపద్దాల కోరని, అసలు బీఆర్ఎస్ పార్టీనే అబద్ధాల పునాదులపై పుట్టిందన్నారు. తాను ,కేకే మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పనిచేశామన్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ కు రెండో స్థానం వచ్చినా. తాను దేనికైనా రెడీ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు మూడో స్థానం వస్తే కేటీఆర్ రాజీనామా చేస్తాడా? అంటూ ఫైర్ అయ్యారు. కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ...రాజకీయ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ మోడీ దగ్గర మోకరిల్లిందన్నారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతుండన్నారు. బీజేపీ కి ఓటు వేయాలని స్వయంగా బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారన్నారు. లిక్కర్ రాణి, కూతురు కవితను జైలు నుండి విడిపించడానికి బీజేపీకి కేసీఆర్ ఓట్లు వేయించారన్నారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. మోడీ కనుసన్నల్లోనే కేసీఆర్ ఉన్నాడన్నారు. కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ ఎవరు ? అంటూ ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లా పొలాలను ఎండబెట్టిన కేసీఆర్, ఆయన పొలాలకు నీళ్లు తీసుకువెళ్లాడన్నారు. దీంతో పాటు బతుకమ్మ చీరల పేరుతో కేటీఆర్ దోపిడీ చేసిండని ఆరోపించారు.

Next Story

Most Viewed