జర్దా తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్​ఓటి పోలీసుల దాడులు

by Kalyani |
జర్దా తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్​ఓటి పోలీసుల దాడులు
X

దిశ, బడంగ్ పేట్​ : జర్దా తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్​ఓటి పోలీసులు బాలాపూర్​ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. జర్దా తయారీ చేస్తున్న ముగ్గురిని రెడ్​ హ్యాండెడ్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళితే ... చార్మినార్​ కు చెందిన సయ్యద్​ ఇర్ఫాన్​ (45) గత కొంత కాలంగా బాలాపూర్​ లోని వాదియే ఉమర్​ కాలనీలో జర్దా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఈ కేంద్రంలో బండ్లగూడ కు చెందిన హరిశంకర్​ రాజ్​పూత్​, విక్రమ్​ సింగ్​ పర్మార్​ లు లేబర్​లుగా పనిచేస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం మహేశ్వరం ఎస్​ఓటి పోలీసులు బాలాపూర్​ పోలీసులతో కలిసి వాదియే ఉమర్​ కాలనీలోని జర్దా తయారీ కేంద్రంపై దాడులు చేశారు. వారి వద్ద నుంచి 18 కిలోల ఎర్ర జర్దా పొడి, ఒక కిలో మెంతి (పుదీనా), 2 కిలోల హిమామ్​ ద్రవం, 4 లీటర్ల రోజ్​ వాటర్​ బాటిల్​, 46,560 టొబాకో స్టాచెట్​​, 2 గోల్డ్​ స్టాచెట్​ రోలర్స్​, 4 గోల్డ్​ ఖాళీ బాక్సులు, మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​ 1, వెయింగ్​ మిషన్​ 1, ప్యాకింగ్​ మిషన్స్​ 2, ప్లాస్టిక్​ ప్యాకింగ్​ కవర్స్​ 2 కిలోలు, మూడు మొబైల్​ ఫోన్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.Next Story

Most Viewed