బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తే ప్రజలు నష్టపోవడం తప్పదు : రఘునందన్ రావు

by Disha Web Desk 23 |
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తే ప్రజలు నష్టపోవడం తప్పదు : రఘునందన్ రావు
X

దిశ,దుబ్బాక : నియోజకవర్గంలోని ప్రతి సమస్యను అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశామని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ రైతు సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొని మాట్లాడుతూ...ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకొని మోసపోయి గోస పడుతున్నామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. 10 సంవత్సరాలు మెదక్ ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఎనాడు పార్లమెంట్ లో మెదక్ ప్రజల సమస్యలపై మాట్లాడలేదన్నారు. ఇప్పడు దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిసిన నాటి నుండి ఒక్క రోజు కూడా ప్రజలను పట్టించుకోవడం లె ని మళ్ళీ ఎన్నికల్లో ప్రజలకు డబ్బులు పంచి గెలుద్దామనే కుట్రలకు తెరతీశారని ఆరోపించారు.

దుబ్బాక నియోజక వర్గం ఓట్ల చివర్లో డబ్బుల కోసం ఆగం కావద్దని గోస పోవద్దని కోరారు. నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చిన అందుబాటులో ఉంటామని చెప్పారు. దుబ్బాక ప్రజలను బానిసలుగా చూసే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రజా సమస్యలపై స్పందించిన పాపాన పోలేదన్నారు. ప్రజలకు డబ్బులకు ఓట్లను అమ్ముకోవద్దని అలాంటి వారు 5 సంవత్సరాలు ప్రజలకు దొరకకుండ అందుబాటులో ఉండరని తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరటం ఖాయమని డబ్బులు ఉన్నోళ్లు సీటు ఇచ్చినందున 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది నిజం కాదా.... మరీ కాంగ్రెస్ కండువా ఎప్పుడు వేసుకుందామా అని ఎదురు చూస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తే ప్రజలు నష్టపోవడం తప్పదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.2500 లు వచ్చాయా...రైతు బంధు ఇప్పటికీ ఊసే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకాలను ప్రజలు గమనించాలని పిలుపు నిచ్చారు. రైతు బంధు డిసెంబర్ నెలలో మాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోపు మా ఫీ చేస్తామని కొత్త నాటకానికి తెరదించారని ఇది రైతులను ప్రజలను మోసం చె సినట్టు కాదా....అని ప్రశ్నించారు.

అబద్దాలతో కూడిని హామిలు ఇస్తూ అవసరం వెళ్ళదీసుకునే నైజం కాంగ్రెస్ ప్రభుత్వం ది అన్నారు.మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పని చేశాడని ఆ రోజుల్లో రైతులు వరి వేస్తే ఉరే నని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రైతులకు 2 లక్షల రుణాలను ఎకకాలంలో మాఫీ చేస్తామని రైతులకు చెప్పిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు గతిన బుద్ధి చెప్పాలని తెలిపారు.రైతులు వరి సాగు చేయరాదని ఒక వేళ సాగు చేస్తే వారికి ఉరే నని రైతులను బెదిరించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మెదక్ పార్లమెంట్ పరిదిలోని రైతులు ఈ ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తాను దుబ్బాక ఎమ్మెల్యేగా కొనసాగిన రోజుల్లో ప్రతి రోజు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేశామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్యను అసెంబ్లీలో బీఆర్ఎస్ నష్టపోవడం తప్పదన్నారు.

రైతులకు పంటల దిగుబడి కోసం యూరియా వంటి ఎరువుల కష్టాలు తీర్చిన నాయకుడు నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కారు పని అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ మొండి చేయి భస్మాసుర హస్తం చేతిలో ప్రజలు మరోసారి మోసపోవద్దని కోరారు. దేశం కోసం రైతుల ఆర్థికాభివృద్ధి కోసం పాటు పడే బీజేపీ ని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా కమలం పువ్వుకు ఓట్లు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చ ఆయా జిల్లాల అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి, సత్యనారాయణ, రాజేందర్రెడ్డి, సుభాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చింత సంతోష్, ఎస్ఎస్ చారి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed