- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాసాలమర్రిలో ఘోరం.. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఘోరం జరిగింది. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఘోరం జరిగింది. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహిపాల్ రెడ్డి(39), అతని భార్య నవిత ఏదో పనిమీద బైకుపై తుర్కపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ఆపై కొద్దిదూరం ఆ బైకును ఈడ్చుకెళ్లింది. ఈ సమయంలో బైకు పూర్తిగా దగ్ధమై మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బైకుపైనే ఉన్న మహిపాల్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిది సిద్దిపేట జిల్లా ములుగుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






