- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళలు ఉద్యోగాలు చేయడంతోనే డివోర్స్..పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత జీవన పథంలో మహిళలు అన్నింట ముందుంటున్నారు. అన్ని రంగాల్లోను పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన నారీమణులు ప్రజెంట్ ఎన్నో ఘన విజయాలు సాధించి ఉద్యోగ రంగంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ మహిళలు ఉద్యోగాలు చేస్తే దాని పర్యవసానాలు ఇలా ఉంటాయంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మహిళలు పనిచేయడం మొదలుపెట్టడంతోనే డివోర్స్‌లు పెరిగాయని ఆ దేశ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాక్‌లో గత మూడేళ్లలో విడాకులు 30 శాతం పెరిగాయని..విదేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మహిళల ఆర్థిక స్వతంత్రం కారణంగా ఇంట్లోని వారిని తామే పోషించాలని నిర్ణయించుకుంటున్నారని తెలిపారు. దీంతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ సైతం ఈ పరిస్థితుల పరిష్కారంపై తనను ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అన్వర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.