Minister Jupalli:ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

by Kalyani |
Minister Jupalli:ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
X

దిశ, కొల్లాపూర్ (కోడేరు): ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao ) స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కోడేరు మండలం ఎత్తం గ్రామంలో గతంలో పేదల నివేశన స్థలాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో 201 మందికి పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పేదల కష్టాలను గుర్తించి పని చేసేది తమ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయ కుమార్, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు, గ్రామ మాజీ సర్పంచ్ సాయిని వరలక్ష్మి, మాజీ ఎంపిటిసి సాయిని శ్రీనివాసరావు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story