వేణుస్వామి బయోపిక్‌లో నటించిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.. సినిమా కూడా సూపర్ హిట్!

by Disha Web Desk 7 |
వేణుస్వామి బయోపిక్‌లో నటించిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.. సినిమా కూడా సూపర్ హిట్!
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంతో బిజీగా ఉన్న ఈయన.. బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఇందు కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తన బయో పిక్‌లో నటించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వేణుస్వామి. ఆ విషయాల్లోకి వెళితే..

వేణుస్వామి మాట్లాడుతూ.. ‘వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అదుర్స్’. ఈ మూవీ నా బయోపిక్‌గా తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో యాక్ట్ చేశారు. రెండు పాత్రలు నావే. అంతే కాదు ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా నేనే జరిపించాను. ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టగా పువ్వు వచ్చింది. దీంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అప్పుడే చెప్పాను. చెప్పినట్లు గానే ‘అదుర్స్’ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణుస్వామి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఎన్టీఆర్ పాత్ర అయుండదులే.. మీది బ్రహ్మానందం పాత్ర అయుంటుంది’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed